జీతాలు ఇవ్వడం లేదని తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ ఆత్మ అత్యాయత్నం చేయడం చాలా బాధాకరం…CPI (ML) న్యూ డెమోక్రసీ డివిజన్ సెక్రెటరీ పి. శ్రీనివాస్

Spread the love
  • జీతాలు ఇవ్వడం లేదని తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ ఆత్మ అత్యాయత్నం చేయడం చాలా బాధాకరం…CPI (ML) న్యూ డెమోక్రసీ డివిజన్ సెక్రెటరీ పి. శ్రీనివాస్
  • నిర్లక్ష్యానికి కారణమైన ఏజెన్సీ పై క్రిమినల్ కేసులు పెట్టాలి …సీపీఐ (ఎంఎల్ )న్యూ డెమోక్రసీ డిమాండ్
  • కూతురు పెళ్లి ఉన్న కూడా జీతాలు ఇవ్వడం లేదు
  • రెండు నెలల జీతంతో పాటు, పీఎఫ్ డబ్బులు ఇవ్వడం లేదు

 

జై భీమ్ న్యూస్ టుడే: (తాండూర్): తాండూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న నర్సింలు జీతాలు ఇవ్వడం లేదని మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేయడం జరిగింది. రెండు నెలల జీతంతో పాటు పీఎఫ్ డబ్బులు కూడా జమ చేయడం లేదని బాధపడడం జరిగింది. ఇట్టి విషయంపై CPI (ML) న్యూ డెమోక్రసీ తాండూర్ డివిజన్ సెక్రెటరీ పి శ్రీనివాస్ మాట్లాడుతూ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కింద పని చేస్తున్న కార్మికులకు చెందాల్సిన చట్టపరమైన హక్కులు ఏవి కూడా చెందకుండా, వారి దగ్గర నుండి దోచుకుంటున్న ఏజెన్సీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. బాధితుడు ఆత్మహత్యాయత్నం చేయడం చాలా బాధాకరమని , బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని పేర్కొనడం జరిగింది. దాంతోపాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని మారినా కార్మికుల యొక్క బతుకులలో ఏ మాత్రం మార్పు లేదని వారిచేత ఇంకా వెట్టిచకిరి చేయిస్తూనే ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. కార్మిక చట్టం ప్రకారం కనీస వేతనం కార్మికులకు చెల్లించాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వాలపైన, కేంద్ర ప్రభుత్వాలపైన ఉందని తెలియజేయడం జరిగింది. కార్మికులకు సమయానికి వేతనాలు ఇవ్వకుండా, మరియు పీఎఫ్ డబ్బులు కూడా జమ చేయకుండా కార్మికులను మోసం చేస్తున్న ఏజెన్సీలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించడం జరిగింది. ఏజెన్సీలు జాబులు పెట్టిస్తామని డబ్బులు డిమాండ్ చేస్తూ , పైగా వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా యేదేచ్ఛగా అందిన కాడికి మింగుతున్నారని దీనిపైన ప్రభుత్వ అధికారులు కూడా ఎందుకు స్పందించడం లేదని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. కార్మికులను మోసం చేస్తున్న ఏజెన్సీల పైన సమగ్ర విచారణ జరిపించాలని, కార్మికులందరికీ వెంటనే  జీతాలు చెల్లించాలని పిఎఫ్ డబ్బులు జమ చేయాలని, ఇన్సూరెన్స్ లాంటివి కల్పించాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.